Header Banner

ATM చార్జీలు పెంపు‌తో కస్టమర్లకు షాక్! నేటి నుంచే కొత్త నిబంధనలు!

  Thu May 01, 2025 11:52        Others

ఏటీఎమ్ విత్‌డ్రాల్ చార్జీలు పెంచినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చార్జీలు ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.

 

ఏటీఎమ్ సేవలకు సంబంధించి నేటి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. అదనపు ఏటీఎమ్ ట్రాన్సాక్షన్లకు ఒక లావాదేవీకి రూ.23 చొప్పున చార్జీని బ్యాంకులు వసూలు చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల వెల్లడించింది. గతంలో అదనపు ట్రాన్సాక్షన్ చార్జీ రూ.21గా ఉండగా ప్రస్తుతం దీన్ని బ్యాంకులు రూ.23కు పెంచేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. నేటి నుంచే ఈ చార్జీలు అమల్లోకి వచ్చాయి. ‘‘ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి జరిపే ప్రతి ఏటీఎమ్ ట్రాన్సాక్షన్లకు కస్టమర్లు రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి’’ అని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!

 

ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం ఈ కొత్త నిబంధనలు.. రీజినల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు, అధీకృత ఏటీఎమ్‌ ఆపరేటర్లు, కార్డు పేమెంట్ నెట్వర్క్, వైట్ లేబుల్ ఏటీఎమ్‌లతో పాటు అన్ని కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయి.

 

తాజా నిబంధనల ప్రకారం, ప్రతి కస్టమర్‌కు తమ సొంత బ్యాంకు ఏటీఎమ్‌ల్లో నెలకు ఐదు నగదు, నగదేతర లావాదేవీలు ఉంటాయి. మెట్రో నగరాల్లోని వారికి ఇతర బ్యాంకుల్లో మరో మూడు ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి. నాన్ మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఎటీఎమ్‌లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకుల్లో మరో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి.

ఈ పరిమితి దాటితే బ్యాంకులు కస్టమర్ల నుంచి ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.23 చార్జీని వసూలు చేస్తాయి. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లతో (నగదు డిపాజిట్, విత్‌డ్రాల్) పాటు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లకు (బ్యాంకు బ్యాలెన్స్ చెకింగ్, ఏటీఎమ్ పిన్ మార్పు వంటివి) వర్తిస్తుంది. ఇక క్యాష్ రీసైక్లర్ మెషీన్లకు సంబంధించి నగదు డిపాజిట చేసే లావాదేవీలకు ఈ నిబంధనలు వర్తించవు.

 

ఇది కూడా చదవండిప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #ATMCharges #WithdrawFees #BankingBurden #RBIUpdate #ATMShock